ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ 7 నిబంధనలు మీకోసమే!
- అద్దె ఒప్పందం ఇకపై తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి
- సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి, గరిష్ఠంగా రెండు నెలల అద్దె మాత్రమే
- యజమానులు చట్ట ప్రకారమే ఇంటిని ఖాళీ చేయించాలి, ఏకపక్షంగా కాదు
- పోలీస్ వెరిఫికేషన్, కేవైసీ ఇప్పుడు ఇరు పక్షాలకూ తప్పనిసరి
- ఇవి దేశవ్యాప్త చట్టాలు కావు, రాష్ట్రాలు అమలు చేస్తున్న మోడల్ యాక్ట్ మార్గదర్శకాలు
భారతదేశంలో ఇల్లు అద్దెకు తీసుకోవాలనుకునే వారికి, ఇప్పటికే అద్దెకుంటున్న వారికి అలర్ట్. అద్దె ఇళ్ల విషయంలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2026 నాటికి దేశవ్యాప్తంగా ఒకే అద్దె చట్టం అమలులో లేనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'మోడల్ టెనెన్సీ యాక్ట్ (MTA), 2021' అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ చట్టంలోని నిబంధనలను స్వీకరించి అమలు చేస్తున్నాయి. అద్దెదారుగా మీ హక్కులను కాపాడుకోవడానికి, యజమానితో వివాదాలు రాకుండా ఉండటానికి ఈ 7 కీలక నియమాలను తెలుసుకోవడం చాలా అవసరం.
1. రాతపూర్వక అగ్రిమెంట్ తప్పనిసరి
గతంలో మాటలతో ఒప్పందం చేసుకునే విధానానికి కాలం చెల్లింది. ఇకపై అద్దెకు సంబంధించిన ప్రతి ఒప్పందం తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి. అద్దె మొత్తం, సెక్యూరిటీ డిపాజిట్, లాక్-ఇన్ పీరియడ్, నోటీస్ పీరియడ్, అద్దె పెంపుదల వంటి అన్ని విషయాలను స్పష్టంగా అగ్రిమెంట్లో పొందుపరచాలి. ఇది యజమాని, అద్దెదారు ఇద్దరికీ రక్షణ కల్పిస్తుంది.
2. డిజిటల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం
అనేక రాష్ట్రాలు అద్దె ఒప్పందాలను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే ప్రక్రియను ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. అయితే, ఈ విధానం ఇంకా దేశవ్యాప్తంగా అన్నిచోట్లా తప్పనిసరి కాలేదు. కాబట్టి, మీరు నివసిస్తున్న నగరంలో లేదా రాష్ట్రంలో ఉన్న స్థానిక నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
3. సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి
మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం, నివాస గృహాలకు యజమానులు గరిష్టంగా రెండు నెలల అద్దెను మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవాలి. అయితే, ఇది అన్ని రాష్ట్రాల్లోనూ కఠినంగా అమలు కావడం లేదు. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, స్థానిక చట్టాలు అనుమతిస్తే యజమానులు ఎక్కువ డిపాజిట్ అడిగే అవకాశం ఉంది. మీ రాష్ట్రంలోని నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యం.
4. అద్దె పెంపుపై స్పష్టత
అద్దెను ఎప్పుడు, ఎంత పెంచుతారనే విషయం ఒప్పందంలోనే స్పష్టంగా రాయాలి. ఎంత శాతాన్ని, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పెంచుతారనే దానిపై కచ్చితమైన నిబంధన ఉండాలి. "తర్వాత మాట్లాడుకుందాం" వంటి అస్పష్టమైన షరతులకు అంగీకరించవద్దు.
5. నిర్వహణ బాధ్యతలు
ఇంటి నిర్వహణకు సంబంధించి ఎవరి బాధ్యత ఏమిటో ముందుగానే తేల్చుకోవాలి. సాధారణంగా, గోడలకు పగుళ్లు, పైకప్పు లీకేజీలు వంటి పెద్ద మరమ్మతులను యజమాని చూసుకుంటారు. ట్యాప్‌లు, లైట్లు వంటి చిన్న చిన్న రోజువారీ నిర్వహణ బాధ్యతలను అద్దెదారు చూసుకోవాలి. ఈ విషయంపై ఒప్పందంలో స్పష్టత ఉంటే భవిష్యత్తులో వివాదాలు రావు.
6. ఖాళీ చేయించే ప్రక్రియ
ఒప్పందం గడువు ముగిసినా, యజమానులు అద్దెదారులను రాత్రికి రాత్రే బలవంతంగా ఖాళీ చేయించలేరు. చట్ట ప్రకారం సరైన నోటీసు ఇచ్చి, న్యాయపరమైన ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఒప్పందం ముగిశాక కూడా ఇల్లు ఖాళీ చేయకుండా మొండికేసే అద్దెదారులకు మోడల్ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంది.
7. పోలీస్ వెరిఫికేషన్, కేవైసీ
యజమాని, అద్దెదారు ఇద్దరూ తమ గుర్తింపు పత్రాలను (పాన్, ఆధార్) సమర్పించడం, పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవడం ఇప్పుడు చాలా చోట్ల తప్పనిసరి. ఇది ఇరు పక్షాల భద్రతకు, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఇంట్లోకి మారే ముందు ఇంటి పరిస్థితిని ఫోటోలు, వీడియోలు తీసి డాక్యుమెంట్ చేసుకోవడం డిపాజిట్ తిరిగి తీసుకునేటప్పుడు వివాదాలను నివారిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను గుడ్డిగా నమ్మకుండా, మీ రాష్ట్రంలోని నిర్దిష్ట చట్టాలను తెలుసుకోవడం శ్రేయస్కరం.